యెహోవా వాక్కు యోనాకి ప్రత్యక్షమై నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పెను అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. తర్వాత యోనాను చేప మ్రింగివేస్తుంది ఆ తర్వాత యోనా నీనెవె పట్టణానికి వెళ్లి వాళ్లకు ఆ వార్త చెప్పనే వారు గోనె భట్ట కట్టుకుని యోహోవాకు ప్రార్థన చేయగా దేవుడు వారిమీదకి ఉగ్రత రాకుండా ఆపివేశాడు. తర్వాత యోనా చింతక్రాంతుడై నేను బ్రతుకుటకంటే చచ్చుట మేలని యోహోవాకి మనవి చేస్తాడు అయితే దేవుడు సోర చెట్టుద్వారా యోనకి బుద్ధిచెప్పేను .
ఇక్కడ మనకు కనిపించేది ఎంటిఅంటే యోనా దేవుని మాట వినలేదు మరియు యోనా దేవుడు చేసిన కార్యాన్ని అంగీకరించలేదు అలా అని యోనా మంచివాడు కాదా ? యోనా కి దేవుడంటే నమ్మకం లేదా ?
ఇప్పుడు యోనాలో ఉన్న మంచి లక్షణాలు చూదాం
1. దేవుడు యోనాతోనే నీనెవె పట్టణం కోసం మాట్లాడటానికి కారణం యోనా ఒక ప్రవక్త కాబట్టి ( పాతనిబంధనలో దేవుడు ప్రవక్తలతోనే మాట్లాడేవాడు అని మనకు తెలుసు )
2. మనం దేవునికి దగ్గరగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు మరి యోనాతో దేవుడు మాట్లాడాడంటే యోనాకి ఆ లక్షణాలు ఉన్నట్టే కథ
3. యోనా మీద దేవునికి నమ్మకం ఉంది కాబట్టే దేవుడు యోనాకి ఈ కార్యం చెయ్యమని మాట్లాడాడు
4. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటీ అంటే యోనా తాను ప్రయాణం చేస్తున్న వాడలో కూడా సువార్త ప్రకటించాడు. యోనా 1:5లో వాడలో ఉన్నవారు అంత తుఫాను చెలరేగాగ వారు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తారు అని ఉంటుంది ) మళ్లీ అదే యోనా 1:14 - 16 మనం చదివితే వారు యెహోవాకి బలి అర్పించినట్టు చూస్తాము. దీనికి కారణం యోనా 1:9 లో యోనా వారికి యెహోవాను పరిచయం చేస్తాడు.
ఈ కథనం ద్వారా మనం గమనించాల్సింది ఎంటి అంటే బైబిల్ లో ఏ గ్రంథం కూడా వ్యర్థంగా రాయించలేదు ఒక్కో వ్యక్తి నుండి ఏదో పాఠం మనం నేర్చుకోవలనే పరిశుధాత్మ అయిన దేవుడు రాయించాడు ఒకటికి రెండుసార్లు మనం చదవడం ద్వారా ఎన్నో విషయాలు అర్థమవుతాయి అలానే యోనా గ్రంథం కూడా యోనా నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నితిమంతులు కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లు చేసిన దేవుడు వారిని విడిచిపెట్టడు వారు చేసే కార్యాలు కుడా దేవుడు ధీవెనకరంగా మారుస్తాడు.
మన ప్రభును రక్షకుడైనా యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు .
Written By Rocky

" original="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhcnm1aWjKY7D37pTNWf2uyGRzgDAZuOvF4R0pZq2MedrW92UReYvnqwIm3KmdJy2fpOPmXhNCwy_Wh674dWrDur-11xQTEnjutBBfPfrpptmwZs8hx7YWVG49fSrST-Mum4YDcwNgPUn4/s200-c/untold016-690x455.jpg" style="
border-radius: 100%;
border-image-source: initial;
border-image-slice: initial;
border-image-width: initial;
border-image-outset: initial;
border-image-repeat: initial;
border-width: 1px;
border-style: solid;
border-color: rgb(235, 235, 235);
margin:0;
padding: 5px;
/" />

No comments:
Post a Comment