అవును మీరు సరిగ్గానే చదివారు , మీరు యుధులవలే చూస్తున్నారా లేక గొర్రెల కపరులవల్లే విశ్వసిస్తున్నారా అంటే దీనికి చాలా లోతైన అర్థం ఉంది అదేంటో మనం ఇప్పుడు చూద్దాం
మనం ఇప్పుడు గొర్రెలకపరుల కొసం చూదాం
( లూకా సువార్ 2 ) దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, అని దూత గొర్రెల కాపరులతో చెప్పినప్పుడు వారు దూత చెప్పిన మాట చొప్పున మన కొరకు రక్షకుడు పుట్టెను అని హృదయ పూర్వకముగా విశ్వసించి ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.
ఇప్పుడు యూదుల కోసం చూదాం
మత్తయి సువార్త : 21 : 1 యేసుక్రిస్తు ప్రభు గాడిద మీద యేరుషాలేముకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలందారూ దారి పొడవునా తమ బట్టలు పరిచి దావిదు కుమారుడికి జయము. ప్రభువు పేరిట వచ్చినవాడు స్తుతింపబడునుగాకా అని కేకలువెసిరి, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే దావిదు కుమారునికి జయము అని పలికిన ఇదే ప్రజలు ( మత్తయి 27 : 23 ) లో యేసుని శిలువ వెయ్యమని పలికారు ఇలా ఎందుకు జరిగిందో ఎప్పడు చుద్దాం
రోమా బానిస్త్వం లో ఉండటం ఇష్టం లేని యూదులు వారికి ఒక ఆశ , ఎదురుచూపు ఉండేది మరియు యూదులు లెక్కువగా లేఖనాలు నమ్మేవారు ఆ లేకనములలో వ్రాయబడినట్టు మేసయ్య వస్తాడు వారిని బానిసత్వం నుండి విడిపిస్తాడు ఆయన యుద్ధగోత్రపు సింహల వస్తాడు అని వారి గట్టి విశ్వాసము అదే విశ్వాసంతో యేసుక్రీస్తు యేసుషాలేముకు వచ్చినప్పుడు యూదుల రాజు వచ్చాడు మమల్ని రోమా బానిసత్వం నుండి విడుదల చేసి వారిని పరిపాలిస్తాడని నమ్మారు వారు యేసుని లోకసంబద్ధమైన రాజుగా మాత్రమే అనుకున్నారు యేరుసలేములో యేసు సువార్త ప్రకటిస్తూ ఉండటం వారు నిరాశపడ్డారు అంతే కాకుండా మోసే ధర్మశాస్త్రన్ని చాలా ఎక్కువ నమ్మే వారిమధ్య యేసు నేను రక్షకున్ని అని చెప్పడం అస్సలు నచ్చలేదు అందుకే యూదులు యేసుని నమ్మలేదు అలాగే శిలువవెయ్యమని కోరుకున్నారు మరియు ఆయనకు మారుగా బందిపోటైనా బారబ్బాను విడిపించుకున్నారు .
ఈ పాఠం ద్వారా మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనం ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం మంచిదే . కానీ! ఇది కేవలం లోకసంబద్ధమైన పండుగగా ఆచరిస్తున్నారా ? లేక గొర్రెలకపరులవలె రక్షకుడు మనకొరకు పుట్టియున్నాడు అని విశ్వసిస్తున్నారా ఒక్క సారి ఆలోచించండి .
మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.
-Written By Rocky



" original="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhcnm1aWjKY7D37pTNWf2uyGRzgDAZuOvF4R0pZq2MedrW92UReYvnqwIm3KmdJy2fpOPmXhNCwy_Wh674dWrDur-11xQTEnjutBBfPfrpptmwZs8hx7YWVG49fSrST-Mum4YDcwNgPUn4/s200-c/untold016-690x455.jpg" style="
border-radius: 100%;
border-image-source: initial;
border-image-slice: initial;
border-image-width: initial;
border-image-outset: initial;
border-image-repeat: initial;
border-width: 1px;
border-style: solid;
border-color: rgb(235, 235, 235);
margin:0;
padding: 5px;
/" />

No comments:
Post a Comment