మునికోలలకు ఎదురు తన్నుట అంటే పూర్తి అర్ధం మీకు తెలుసా ?

 మునికోల

అపోస్తులు : 26 :14 లో మేమందరము నేలనపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు ,  మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. 
ఈ సందర్భం మనకందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి " మునికోలలు " అనే పదానికి అర్ధం తెలియకపోవచ్చు అందరికి తెలీదు అని న ఉద్దేశం కాదు - అయితే ఒక పదం మనకు అర్ధం కాకపోతే దాని పూర్తి అర్ధం మారిపోవొచ్చు . 

ఇప్పుడు అర్ధం తెలుసుకుందాం :
మునికోలలు అంటే ఎద్దులను , లేదా ఏనుగులను కంట్రోల్ చెయ్యడానికి వాడే ఒక సన్నని బల్లెం లాంటి పరికరం ఇది చాలా షార్ప్ గ ఉంటుంది , అయితే దేవుడు సౌలుకు ఇదే చెప్తున్నాడు మునికోలలను ఎదురు తన్నితే అది నీకే ప్రమాదం , నీకే నష్టం అని 

  • ఒక ఉదాహరణ చూద్దాం 

1. ఎస్తేరు గ్రంధం లో దేవునిచే ఆశీర్వాదము పొందిన మొర్దెకై అనే యూదుడు మనకు తెలుసు. 
రాజైనా అహష్వేరోషు  ఆగాగియుడైన హనమనును హెచ్చించి గనపరిచేను ఈలాగు జరిగిన తర్వాత రాజసేవకులందరు మోకాళ్ళూని హామానుకి నమస్కారము  చేస్తుఉండేవారు  కానీ మొర్దెకై మాత్రం ఇలా ఎప్పుడు చెయ్యలేదు ఇది గమనించిన హామాను తన మనసులో  కపటోపాయము చేసి మొత్తం యూదా ప్రజలందరిని  హతం చేయించాలని రాజుతో తాఖీదు రాయిస్తాడు 

కానీ ! ఎస్తేరు 8 : 7 లో అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను 
అంటే హామాను చేయించిన ఉరికొయ్యకు హామానునే ఉరితీశారు ( దీనిని కూడా మనం మునికోలలకి ఎదురుతన్నడం అనొచ్చు ) 

దీనిని మనం ఎలా మన జీవితాలకు సరి పోల్చికోవాలంటే దేవునికి వ్యతిరేకమైనవి , దేవునికి ఇష్టం లేనివి ఏవైనా సరే అవి మనకు మునుకోలలతో సమానం కాబట్టి క్రైస్తవులైన మనం దేవుని చిత్తప్రకారము మన అడగలు వెయ్యడం మనకు ఆశిర్వాదకరం .

మన ప్రభును రక్షకుడైనా యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు .
- Written By Rocky

No comments:

Post a Comment