మొదటిగా మనం గ్రహించవాల్సింది ఏంటి అంటే దేవ్వుని అంగీకరించి నడవటానికి యవ్వనస్థుల్ని ఆకర్షించింది ఏంటి ? వారు ఎందుకు దేవుని వైపు తిరిగారు ? ఈ ప్రసన్నలతో మనం ముందుకు వెళ్తేనే ఆరంభం నుండి ముగింపుకు చేరుకుంటాం
దేవునిలో నడిచే యవ్వనస్థులలు మూడు విధాలుగా ఉన్నారు
- క్రైతవ కుటుంబం లో పుట్టి దేవునిలో కొనసాగేవారు
- జీవితం లో పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా మారి ఎటు వెళ్లలేని స్థితిలో దేవుని వైపు నీరాశగా చూసేవారు
- మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ లో ఉన్న కొత్త హంగులు ( లేదా ) ఇపుడు పెరిగిన సెల్ఫ్ ప్రమోషన్ అనే ఒక ఆకర్షణతో వచ్చేవాళ్లు
1.క్రైస్తవ కుటుంబం లో పుట్టి దేవునిలో కొనసాగే వారు
వీరి జీవితం మనం చూస్తే చిన్నతనం నుండి విల్లు క్రైస్తవ వాతావరణం లో జీవిస్తారు కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం , బైబిల్ లో ఉన్న విషయాలతో పాటు ఎలా దేవునుకి దగ్గరగా ఉండాలి అనే విషయాలు మిగిలిన వారికన్నా వీరికి చాలా సులువుగా ( లేదా ) వాడుకగా అర్థం అవుతుందని చెప్పవచ్చు అంతే కాదు ఆధ్యాత్మికమైనా విషయాలు ఏదువారికి చెప్పగలిగే విధానం కూడా వీరు గలిగి ఉంటారు ఇది దేవుని నడిపింపు అని కూడా అనవచ్చు
2.జీవితం లో పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా మారి ఎటు వెళ్లలేని స్థితిలో దేవుని వైపు నీరాశగా చూసేవారు
మనం దేవుణ్ణి అంగీకరించిన వారిలో కొంతమందిని మనం ప్రశ్నిస్తే వారూ చెప్పే మాట ఏంటి అంటే మేము జీవితం ఇష్టం వచ్చినట్టు జీవించి ఇప్పుడు ఏ వైపుకు వెళ్తున్నాం , ఏ వైపుకు వెళ్ళాలి మా జీవితం మళ్లీ తిరిగి వస్తుందనుకోవడం లేదు ఎవరు మాకు సహాయం చెయ్యలేరు మాకు ఉన్న ఒక్క అవకాశం దేవుడు మాత్రమే ( అవకాశం అనే మాట ఎదుకు వాడాల్సి వచ్చిందంటే అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం వేరు లేమిలో దేవుని వైపు చూడడం వేరు ) మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే నమ్మకం మరియు విశ్వాసం ఉంటే దేవుడు కచ్చితంగా సహాయం చేస్తాడు తన కృప యొక్క పరిమాణం మనకు చూపక మానాడు
కానీ ! ఇక్కడ చాల జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే యవ్వనస్థులు వేటిని చేస్తూ , వేటి భానిసత్వం లో నలిగి జీవితం శూన్యంలోనికి తెచ్చుకున్నారో వాటిని వదులుకుని దేవుని వైపు చూస్తారు వారి జీవితం లో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తారు
వీరు క్రైతవ జీవితం మొదోలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ఆశక్తి , దేవునికోసం ఎన్నో తెలుసుకోవాలని ఉస్త్సాహం కచ్చితంగా దేవుడు వారి జీవితంలో నూతన కార్యం చేస్తాడనే గట్టి విశ్వశంతో దేవునిలో కొనసాగుతారు
అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది వారూ కొంత కాలం గాడిచినా తర్వాత వారు ఎదురుచూస్తున్న కార్యం కొంత ఆలశ్యం అవ్వగానే వారిలో ఒక ప్రశ్న మొదలవుతుంది ఆ ప్రశ్న నిరాశ వైపు నడిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా ? అనే ఆలోచన వీరిలో తీసుకొచ్చి వారి వదులుకున్న ఒక్కొక చెడు కార్యాలను వారి ముందుకు మళ్లీ తీసుకొస్తుంది ఇది సాతను చేసే క్రియ , ఈ అలోచనా , సందేహం , నిరాశ వీటిని జయించి దేవుడు నాకోసం రెండింతల మేళులు దాచుంచాడు అని విశ్వసముంచినవారు దేవుని కార్యాలు చూస్తారు లేనివారు తిరిగి పాత జీవితానికి లొంగిపోతున్నారు .
3. ఇప్పడు పెరిగిన సెల్ఫ్ ప్రమోషన్ అనే ఒక ఆకర్షణతో వచ్చేవాళ్లు
ఇప్పుడున్న ప్రస్తుత కాలం లో ఎక్కువ శాతం వీరే
అసలు విషయం మొదలుపెడితే సెల్ఫ్ ప్రమోషన్ ఆకర్షణ అంటే ఏంటి ?
వారిని వారు ప్రమోట్ చేసుకోవడం , ఆన్లైన్ లో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం , ఇంకా క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే లైక్స్ , షేర్స్ కోసం ఇలాంటి వారు లేరంటారా ? మన మద్యా ! కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అందరూ ఇలా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ! ఎక్కవ శాతం ఇలానే ఉన్నారు మనం కూడా ఒక ఇన్స్టాగ్రాన్ , యూట్యూబ్ , ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం మనం కూడా ఆన్లైన్ లో కనపడాలి అనేవారే ఎక్కువ అయ్యారు దేవుని సూర్త ప్రకటించడం తప్పు కాదు ( మార్కు 16:15 లో ) మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అని వ్రాయబడి వుంది
నీవు వెళ్లే మార్గం సరైనది అయితే నీ వెనకాల అనేకమంది రక్షించాడతారు దేవుడే నిన్ను నడిపిస్తాడు లేదంటే నిన్ను బట్టి దేవుని నామానికే అవమానం మనం లోకసంబంద్ధమైన కార్యాలు చేస్తూ పాపపు జీవితం , సినిమాలు , షికార్లు అంటూ తిరిగే నువ్వే సరైన మార్గం లో వుండండి అని ఎదుటవారికి చెప్తే వారు వింటారా ?
ముందు నీ కంటిలో దూలము తీసివెయ్యము అని లేకనములో వ్రాయబడలేదా ? .
యవ్వనస్థులమైన మనం ఒక విషయం గమనించాలి ఏ గుంపులో మనం ఉన్నాం ? మనం నిజమైన భక్తి చూస్తున్నామా ? వేషధారులవలే ఉన్నామా ? ఆకర్షణ , హంగు , ఆర్భాటాల కోసం భక్తి చేయొద్దు దీనివల్ల దేవుని నామానికి అవమానం మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుని మోసం చేసేవారం అవుతాం మనం అందరం దేవుని సువార్త ప్రకటించాలి దీనికి మొదట మనల్ని దేవుని అప్పగించుకోవాలి , మన తలంపు దేవుని ఎదుట పెట్టి ప్రార్థన పూర్వకంగా అడుగుతూ దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయనే మన మార్గాలు సరళం చేస్తాడు .
వ్రాయబడిన ఈ అంశం ఎవరిని ఉద్దేశించింది కాదు నన్ను నేను ప్రశ్సించుకుంటూ దేవుని నడిపింపులో వ్రాస్తున్న అని నమ్ముతున్న చదివిన మీ అందరికీ ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్న
⁃ Amen
- Written By Rocky




" original="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhcnm1aWjKY7D37pTNWf2uyGRzgDAZuOvF4R0pZq2MedrW92UReYvnqwIm3KmdJy2fpOPmXhNCwy_Wh674dWrDur-11xQTEnjutBBfPfrpptmwZs8hx7YWVG49fSrST-Mum4YDcwNgPUn4/s200-c/untold016-690x455.jpg" style="
border-radius: 100%;
border-image-source: initial;
border-image-slice: initial;
border-image-width: initial;
border-image-outset: initial;
border-image-repeat: initial;
border-width: 1px;
border-style: solid;
border-color: rgb(235, 235, 235);
margin:0;
padding: 5px;
/" />

No comments:
Post a Comment